కాష్మోరాతో భయపెడతా | Karthi's look in 'Kashmora' | Sakshi
Sakshi News home page

కాష్మోరాతో భయపెడతా

Published Fri, Aug 19 2016 2:28 AM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

కాష్మోరాతో భయపెడతా - Sakshi

కాష్మోరాతో భయపెడతా

కొంబన్, తోళా చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్న నటుడు కార్తీ తాజాగా కాష్మోరాగా మారి బ్రహ్మాండాలతో భయపెట్టడానికి సిద్ధం అవుతున్నారు.మాయ, ఇటీవల జోకర్ వంటి విభిన్న, విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ సంస్థ అధినేతలు ఎస్‌ఆర్.ప్రకాశ్‌బాబు,ఎస్‌ఆర్.ప్రభు నిర్మిస్తున్న తాజా భారీ చిత్రం కాష్మోరా. కార్తీ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో నాయికలుగా నయనతార, శ్రీదివ్య నటిస్తున్నారు.
 
  నటుడు వివేక్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఇంతకు ముందు ఇదర్కుదానే అశైపట్టాయ్ బాల కుమారా చిత్రానికి దర్శకత్వం వహించిన గోకుల్ కథ,కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న కాష్మోరా చిత్రం గురించి నిర్మాతలు తెలుపుతూ హారర్, కామెడీ, యాక్షన్ ఇత్యాధి అంశాలతో తెరకెక్కుతున్న తొలి తమిళ చిత్రం ఇదని తెలిపారు. ఇందులో కార్తీ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారని చెప్పారు.
 
  ఈ చిత్రం కోసం ఆయన మూడు నెలలు సమయం తీసుకుని 47 గెటప్‌లు పరిశీలించి అందులో మూడింటిని ఎంపిక చేసుకుని నటించడం విశేషం అన్నారు. కాష్మోరా చిత్రం కోసం పలు ప్రాంతాల్లో పలు భారీ సెట్స్ వేసి చిత్రీకరణ జరిపినట్లు తెలిపారు. పలు ఆసక్తికరమైన అంశాలతో బ్రహ్మాండంగా కాష్మోరా చిత్రం ఉంటుందని తెలిపారు. దీనికి సంతోష్‌నారాయణన్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement