'హాట్ గాయ్ దొరికితే డేటింగ్ చేద్దామనుకుంటున్నా'
లండన్: తాను చక్కటి హాట్ బాయ్ తో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు ప్రముఖ హాలీవుడ్ నటి కేట్ హడ్సన్ చెప్పింది. తన భర్త మట్ బెల్లామీతో 2014లో తెగదెంపులు చేసుకున్న ఈ 37 ఏళ్ల సుందరీ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఎక్కడికైనా దూరంగా సరదాగా ఎగిరిపోవాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. ఆకర్షణీయంగా ఉండే ఓ హాట్ గాయ్ దొరికితే అతడితో చెట్టాపట్టాలేసుకొని, ఎక్కడికైనా దూరంగా వెళ్లి డేటింగ్ చేయాలని భావిస్తున్నట్లు ఓ మేగిజిన్ కు తెలిపింది.
'మీకు తెలుసా నాకు నిజంగా ఏం కావాలో? నిజాయితీగా చెబుతున్నా.. నేను నిజాయితీగానే ముందుకెళుతున్నాను. నాకొక ఫన్నీ, హాట్ గాయ్ కావాలి. అలాంటివాడైతే నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచగలడు. అంతేకాదు.. అతడు నన్నిక ఎప్పటికీ వదిలిపోకూడదు. జీవితాంతం తోడుగా ఉండాలి కూడా' అంటూ ఆమె వెల్లడించింది. బ్రాడ్ఫిట్లాంటి వాడు దొరికితే పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'తప్పకుండా చేసుకుంటాను. బ్రాడ్ చాలా చాలా అందగాడు' అని చెప్పింది.