కుర్రాడు కత్తిలాంటోడు | Kattilanti Kurrodu movie started on Vijayadashami day | Sakshi
Sakshi News home page

కుర్రాడు కత్తిలాంటోడు

Published Wed, Oct 12 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

కుర్రాడు కత్తిలాంటోడు

కుర్రాడు కత్తిలాంటోడు

విసుశ్రీ, అక్ష, హమీదా నటీనటులుగా జంగాల నాగబాబు దర్శకత్వంలో ఎల్.నాని నిర్మిస్తున్న ‘కత్తిలాంటి కుర్రాడు’ చిత్రం విజయదశమినాడు ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి చిత్రనిర్మాత కెమేరా స్విచాన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ఇ. సత్తిబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఫారిన్‌లో రెండు పాటలు చిత్రీకరిస్తాం’’ అని ఎల్.నాని తెలిపారు.

‘‘టైటిల్‌కి తగ్గట్టు హీరో క్యారెక్టరైజేషన్ పదునైన కత్తిలా హుషారుగా ఉంటుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది’’ అని జంగాల నాగబాబు చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: వాసిరెడ్డి సత్యానంద్, సంగీతం: కమల్, స్టంట్స్: కనల్ కణ్ణన్, సహ నిర్మాతలు: డి.రవికుమార్, సి.హెచ్.నాగేశ్వరరావు

Advertisement

పోల్

Advertisement