E. Sattibabu
-
కుర్రాడు కత్తిలాంటోడు
విసుశ్రీ, అక్ష, హమీదా నటీనటులుగా జంగాల నాగబాబు దర్శకత్వంలో ఎల్.నాని నిర్మిస్తున్న ‘కత్తిలాంటి కుర్రాడు’ చిత్రం విజయదశమినాడు ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి చిత్రనిర్మాత కెమేరా స్విచాన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ఇ. సత్తిబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఫారిన్లో రెండు పాటలు చిత్రీకరిస్తాం’’ అని ఎల్.నాని తెలిపారు. ‘‘టైటిల్‌కి తగ్గట్టు హీరో క్యారెక్టరైజేషన్ పదునైన కత్తిలా హుషారుగా ఉంటుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది’’ అని జంగాల నాగబాబు చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: వాసిరెడ్డి సత్యానంద్, సంగీతం: కమల్, స్టంట్స్: కనల్ కణ్ణన్, సహ నిర్మాతలు: డి.రవికుమార్, సి.హెచ్.నాగేశ్వరరావు -
‘హలో బ్రదర్’ని తలపించేలా...
వారసత్వంగా వస్తున్న ఆస్తిని కాపాడుకోడానికి ఓ కుర్రాడు ఎన్ని పాట్లు పడ్డాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోన్న హాస్యభరిత చిత్రం ‘జంప్ జిలాని’. అల్లరి నరేశ్ తొలిసారి అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి ఇ.సత్తిబాబు దర్శకుడు. అంబికా రాజా నిర్మాత. ఇషా చావ్లా, సాక్షి దీక్షిత్ కథానాయికలు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘‘హలో బ్రదర్’లో నాగార్జునగారి ద్విపాత్రాభినయాన్ని తలపించేలా ఇందులో అల్లరి నరేశ్ పాత్రలు సాగుతాయి. ఇందులో ఇషా చావ్లా ఫుడ్ ఇన్స్పెక్టర్గా నటిస్తోంది. నాన్‌స్టాప్ ఎంటర్టైనర్గా ఉంటుందీ సినిమా’’ అని తెలిపారు. ‘‘తమిళ చిత్రం ‘కలగలప్పు’కు ఈ చిత్రం రీమేక్. రెండు పాత్రల్లో నరేశ్ కావల్సినంత వినోదాన్ని పంచుతారు. ఇందులోని ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్వించేలా ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకాక్, పుకెట్లలో నరేశ్, ఇషా, సాక్షి దీక్షిత్‌లతో పాటల్ని తీస్తున్నాం. ఓ వైపు రీ-రికార్డింగ్ కూడా జరుగుతోంది’’ అని నిర్మాత చెప్పారు. విజయ్ ఎబెంజర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను త్వరలోనే విడుదల చేసి, మే నెలలో సినిమాను విడుదల చేస్తామని సమర్పకుడు అంబికా కృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అంబికా కృష్ణ బ్రదర్స్.