'చిరంజీవి సినిమాతో ఎంట్రీ వెరీ లక్కీ' | 'Khaidi No. 150' a dream debut for Tarun Arora | Sakshi
Sakshi News home page

'చిరంజీవి సినిమాతో ఎంట్రీ వెరీ లక్కీ'

Published Mon, Oct 31 2016 12:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

'చిరంజీవి సినిమాతో ఎంట్రీ వెరీ లక్కీ'

'చిరంజీవి సినిమాతో ఎంట్రీ వెరీ లక్కీ'

చెన్నై: చిరంజీవి 150 సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కావడం తన అదృష్టమని నటుడు తరుణ్ ఆరోరా అన్నాడు. తనకు ఇంతకన్నా మంచి లాంచింగ్ దొరకదని పేర్కొన్నాడు. 'ఖైదీ నంబర్ 150' సినిమాలో అతడు విలన్ గా నటిస్తున్నాడు. 

'చిరంజీవి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది. ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాను. మాతృకతో పోలిస్తే తెలుగు వెర్షన్ లో చాలా మార్పులు చేశారు. దర్శకుడు చెప్పినట్టుగా చేసుకుపోతున్నాను. నన్ను వివి వినాయక్ బాగా ప్రోత్సహిస్తున్నారు. షూటింగ్ అంతా సవ్యంగా సాగుతోంద'ని తరుణ్ ఆరోరా చెప్పాడు.

హిందీలో పలు చిత్రాల్లో నటించిన తరుణ్ తమిళంలో ‘కనిదన్’ చిత్రంలో యాక్ట్ చేశారు. ఆ చిత్రంలో నటన నచ్చి, చిత్రదర్శకుడు వినాయక్  విలన్‌గా తీసుకున్నాడు. అన్నట్లు ఈ తరుణ్ అరోరా ఎవరో కాదు.. తెలుగులో పలు చిత్రాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్నహీరోయిన్ అంజలా జవేరి భర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement