
భరత్ అనే నేను సెట్స్‌లో మహేష్-కొరటాల
కెరీర్‌లో మొదటిసారిగా భరత్ అనే నేను చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నారు. సాధారణంగా రాజకీయాలంటే ఆసక్తి లేని మహేష్.. ఈ రోల్ ఎలా ఒప్పుకున్నాడు? దర్శకుడు కొరటాల శివ.. మహేష్‌ని ఎలా కన‍్విన్స్ చేశాడు? సినిమాలో ఆ పాత్రను ఎలా పండించి ఉంటాడు.. అన్న అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. దీనిపై ప్రమోషన్‌లలో చిత్ర దర్శకుడు కొరటాల శివ స్పందించారు.
‘ఈ సినిమా కథ ఓకే అయ్యాక మహేష్ భయం అంతా ఒక్కటే. ‘సర్.. నేను ఈ పాత్రను చేయగలనా?’ అని.. ఆయనకు రాజకీయాల గురించి అవగాహన లేదు. వాటి మీద ఆసక్తి లేదు. ఎలాగా? అని నన్ను అడిగారు. కానీ, తర్వాత సినిమా కోసం ఆయన రాజకీయ నాయకుల మేనరిజం చూడాల్సి వచ్చింది. అంతేకాదు నెట్‌లో అసెంబ్లీ సమావేశాల తాలూకూ వీడియోలను చాలా ఓపికగా చూశారు. ట్రైలర్ విడుదలయ్యాక.. ఓత్ సీన్‌కి సంబంధించి గొంతులో రాజకీయ నాయకులకు ఉండాల్సిన గాంభీర్యం సరిపోదేమోనని మేం అనుకున్నాం. కానీ, క్లాసీ స్టైల్‌లో ముఖ్యమంత్రిగా మహేష్ ఎలా అలరించి ఉంటాడో అన్న అంచనాలు ఇప్పుడు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. మహేష్ ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచరు’అని కొరటాల చెప్పుకొచ్చారు.
పొలిటికల్ కమర్షియల్ డ్రామాగా తెరకెక్కిన భరత్ అనే నేను ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో విదేశాల్లో ఉన్న మహేష్.. సరిగ్గా చిత్ర విడుదలకు ముందు చిత్ర ప్రమోషన్‌లో పాల్గొనబోతున్నారు. శ్రీమంతుడు కాంబోలో రాబోతున్న చిత్రం కావటంతో భరత్ అనే నేనుపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment