కొరటాల శివ, వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు | koratala siva wish all the govts sets up SIT's to eradicate corruption | Sakshi
Sakshi News home page

కొరటాల శివ, వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Fri, Jul 28 2017 4:07 PM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

కొరటాల శివ, వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు - Sakshi

కొరటాల శివ, వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌: డ్రగ్స్‌ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌ కంటే అవినీతి సమాజానికి ప్రమాదకరమైందని, అవినీతిని నిర్మూలించేందుకు అన్ని ప్రభుత్వాలు ప్రత్యేక దర్యాప్తు బృందాలు(సిట్‌) ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వాలు తలచుకుంటే ఇది సాధ్యమేనని ట్వీట్‌ చేశారు.

విలక్షణ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కూడా డ్రగ్స్‌ వ్యవహారంపై మరోసారి తనదైన శైలిలో ఫేస్‌బుక్‌ పేజీలో కామెంట్లు పోస్ట్‌ చేశారు. 'డ్రగ్స్‌ తీసుకున్నారని మీరు అనుమానిస్తున్న చార్మి కౌర్‌, పూరి జగన్నాథ్‌, సుబ్బరాజు, నవదీప్‌ తదితరులు ఆరోగ్యవంతంగా, అందంగా కనిపిస్తున్నారు. డ్రగ్స్‌ వాడితే తమకు మంచి జరుగుతుందని యువత భావించే అవకాశముంది. యువతకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూడాలని ఆశిస్తున్నాను. విచారణకు వచ్చిన సినిమా తారలు ఎందుకు అంత అందంగా ఉన్నారో సిట్‌ వివరిస్తే బాగుంటుంది. తమను విచారించిన మహిళా అధికారుల కంటే ముమైత్‌ ఖాన్‌, చార్మి ఆరోగ్యంగా ఉన్నారని కొంతమంది బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ఇలా అపార్థం చేసుకుంటున్న యువతకు బాధ్యతాయుతమైన అధికారులు స్పష్టత ఇస్తే మంచిద'ని వర్మ వ్యాఖ్యానించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement