వ్యక్తిగత రహస్యం చెప్పిన లేడి గగా | Lady Gaga dealing with chronic pain | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత రహస్యం చెప్పిన లేడి గగా

Published Sun, Nov 20 2016 11:23 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

వ్యక్తిగత రహస్యం చెప్పిన లేడి గగా

వ్యక్తిగత రహస్యం చెప్పిన లేడి గగా

లండన్‌: ప్రముఖ పాప్‌ స్టార్‌ లేడి గగా(30) అంటేనే పాప్‌ గీతాలు మన కళ్లముందు కదిలే విషయం తెలిసిందే. ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉంటూ మైకందుకుని ఉర్రూతలూరించేలా గీతాలు ఆలపించేలా చేసే ఆమె కూడా గత కొంతకాలంగా ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంట. ఆమె స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. తొలిసారి దానికి సంబంధించిన తన వ్యక్తిగత రహస్యాన్ని చెప్పింది.

తాను గత కొంతకాలంగా క్రానిక్‌ పెయిన్‌(దీర్ఘకాలిక నొప్పి)తో బాధపడుతున్నానని తెలిపింది. తన ఈ ఆరోగ్యపరమైన అంశాన్ని సామాజిక అనుసంధాన వేదిక ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా పంచుకుంది. ‘ప్రతి రోజు నొప్పులతో బాధపడుతున్నాను. అయితే, అనుభవజ్ఞులైన మహిళా వైద్యులు నా చుట్టే ఉండటం వల్ల చాలా సంతోషంగా భావిస్తున్నాను. ప్రస్తుతం ఆమె జోన్నే అనే అల్బం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement