
బాంబులంటే మహా భయం: లావణ్యా త్రిపాఠి
ఇక టపాసులు గురించి చెప్పాలంటే నాకు బాంబులంటే మహా భయం.
దీపావళిని మా ఇంట్లో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి దీపావళికి మా నాన్నగారు వెండి నాణెం కొంటారు. దాన్ని పూజలో ఉంచుతాం. ఈ పూజ కోసం వారం రోజుల ముందు నుంచే సన్నాహాలు మొదలుపెడతాం. ముందు ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తాం. ఆ తర్వాత ప్రమిదలన్నీ అటక మీద నుంచి దించి అవి క్లీన్ చేస్తాం. మా నార్త్‌లో దీపావళిని న్యూ ఇయర్‌లా భావిస్తాం. కొత్త సంవత్సరం రోజు మంచి పనులు చేస్తే మిగతా సంవత్సరం అంతా బాగుంటుందని మా అమ్మ నమ్ముతుంది. అందుకని మా స్కూల్ డేస్‌లో క్లాస్ పుస్తకాలన్నిటినీ పూజలో ఉంచుతుంది. కాసేపు చదివించేది.
ఇక టపాసులు గురించి చెప్పాలంటే నాకు బాంబులంటే మహా భయం. కాకరపువ్వొత్తులు అంటే చాలా ఇష్టం. వాటిని బాగా కాల్చేదాన్ని. ఈ దీపావళి మా ఇంట్లో (డెహ్రాడూన్) జరుపుకుంటున్నాను. యాక్చువల్‌గా హాలిడే ట్రిప్ కోసం వారం రోజుల క్రితం ఇండోనేషియా వెళ్లాను. దీపావళి పండక్కి కంపల్సరీగా ఇంట్లో ఉండాలని అమ్మ ఫోన్ చేసింది. అందుకే డెహ్రాడూన్ వచ్చాను. నా కోసం మా అమ్మ ఓ ట్రెడిషనల్ డ్రెస్‌ను డిజైన్ చేయించింది. మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఈ పండగ జరుపుకోండి.