శంకరాభరణం, సిరి సిరి మువ్వ, స్వాతి కిరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన లెజెండరీ దర్శకుడు కే విశ్వనాథ్ జీవితంపై బయోపిక్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత జనార్థన్ మహర్షి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తి కర చర్చ జరుగుతోంది. కమల్ హాసన్, చిరంజీవి, మమ్ముట్టి లాంటి టాప్ స్టార్స్‌ను డైరెక్ట్ చేసిన విశ్వనాథ్ పాత్రలో ఎవరు నటిస్తారా అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండంతో త్వరలోనే విశ్వనాథ్ పాత్రలో కనిపించే నటుడిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment