Janardhan Maharshi
-
‘విశ్వదర్శనం’కి దాదాసాహెబ్ పురస్కారం
‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘విశ్వదర్శనం’. ‘వెండితెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అన్నది ఈ సినిమా ట్యాగ్‌లైన్. కె.విశ్వనాథ్ లీడ్ రోల్లో పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు జనార్థన మహర్షి దర్శకుడు. ఇటీవల ‘సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2019’లో డాక్యుమెంటరీ విభాగంలో (పనోరమ సెక్షన్) ‘విశ్వదర్శనం’ ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. దాదాసాహెబ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక జ్యూరీ విభాగంలో ఈ చిత్రానికి పురస్కారం లభించింది. ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్న జనార్థన మహర్షి మాట్లాడుతూ– ‘నా జీవితంలో నేను సాధించిన విజయాల్లో ఇది మరపు రానిది. కె. విశ్వనాథ్‌గారి జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఈ పురస్కారం రావడంతో నా ఆనందానికి అవధులు లేవు. ఈ చిత్రం మరెన్నో జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఇక నుంచి ప్రదర్శించబడుతుంది’ అని తెలిపారు. -
‘విశ్వదర్శనం’ టీజర్ లాంచ్
శంకరాభరణం, సిరి సిరి మువ్వ, స్వాతి కిరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన లెజెండరీ దర్శకుడు కే విశ్వనాథ్ జీవితంపై బయోపిక్ ను విశ్వ దర్శనం పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత జనార్థన్ మహర్షి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. మంగళవారం కె. విశ్వనాథ్ జన్మదినం సందర్భంగా ఒక రోజు ముందుగానే సోమవారం ‘విశ్వదర్శనం’ టీజర్‌ను ఫిలింనగర్‌లోని కె.విశ్వనాథ్ నివాసంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్, జనార్ధన మహర్షి, వివేక్ కూచిబొట్ల, తనికెళ్లభరణి, సింగర్ మాళవిక తదితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.విశ్వనాథ్ మాట్లాడుతూ ‘నాకు నేను చాలా గొప్పవాణ్ని, నా గురించి అందరికీ తెలియాలి అనే ఆశ నాకు లేదు. కానీ, కొన్నిసార్లు మనల్ని అభిమానించే వారి కోసం కొన్ని పనులు కచ్చితంగా చేయాలి. అటువంటి ప్రయత్నమే విశ్వదర్శనం. ఈ ఆలోచనకు నీరు పెట్టింది, నారు పోసింది అంతా జనార్ధన మహర్షి అనటంలో అతిశయోక్తి లేదు. నా పుట్టినరోజు సందర్భంగా వాళ్లు చేస్తున్న ఈ టీజర్ రిలీజ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అన్నారు. దర్శకుడు జనార్ధనమహర్షి మాట్లాడుతూ ‘మా అమ్మగారు విశ్వనాథ్‌గారి భక్తురాలు. ఆమె చిన్నప్పటి నుంచీ ఆయన తీసిన సినిమాల్లోని కథలను చెప్తుంటే వింటూ పెరిగాను. నాకు చిన్నప్పటి నుంచీ విశ్వనాథ్‌గారు డైరెక్టర్‌కాదు, హీరో. 2011లో నా సొంత బ్యానర్‌పై తీసిన ‘దేవస్థానం’ అనే చిత్రంలో ఆయన్ను డైరెక్ట్ చేసే భాగ్యం నాకు దక్కింది. మళ్లీ 2019లో ఆయనతో పనిచేసే అవకాశం ఈ విశ్వదర్శనం సినిమా ద్వారా వచ్చింది. వెండితెరపై ఎందరో మహానుభావులు కథలు తీశారు. ఈ సినిమాలో మేం ఆయన బయోగ్రఫీ చూపించటంలేదు. ఇండియాలో ఓ మహాదర్శకుని సినిమాల వల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఆ రోజుల్లో పడింది అనేది మా సినిమాలో చూపించబోతున్నా’ మన్నారు. నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘అందరు దర్శకులకు అభిమానులు ఉంటారు. విశ్వనాథ్ గారికి మాత్రం భక్తులు ఉంటారు. అటువంటి ఎంతో మంది భక్తుల్లో జనార్ధనమహర్షి ఒకరు. వారి ఈ సినిమాకు డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేను కానీ కీర్తి మాత్రం పుష్కలంగా వస్తుంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని ఆశిస్తున్నా’ అన్నారు. -
కళా తపస్వి పాత్రలో ఎవరు..?
శంకరాభరణం, సిరి సిరి మువ్వ, స్వాతి కిరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన లెజెండరీ దర్శకుడు కే విశ్వనాథ్ జీవితంపై బయోపిక్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత జనార్థన్ మహర్షి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తి కర చర్చ జరుగుతోంది. కమల్ హాసన్, చిరంజీవి, మమ్ముట్టి లాంటి టాప్ స్టార్స్‌ను డైరెక్ట్ చేసిన విశ్వనాథ్ పాత్రలో ఎవరు నటిస్తారా అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండంతో త్వరలోనే విశ్వనాథ్ పాత్రలో కనిపించే నటుడిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
విశ్వదర్శనం ; కళాతపస్వి బయోపిక్
టాలీవుడ్లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ల బయోపిక్‌లు నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో సీనియర్ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్ చేరారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. విశ్వనాథ్ బయోపిక్కు ‘విశ్వదర్శనం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. నేడు జరిగిన పూజ కార్యక్రమంలో విశ్వనాథ్, తనికెళ్ల భరణి, జనార్ధన మహర్షితో పాటు పలువురు నటీనటులు పాల్గొన్నారు. కాగా ఈ చిత్రంలో విశ్వనాథ్ పాత్రను ఎవరు పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. ఎన్నో గొప్ప చిత్రాలను అందించిన విశ్వనాథ్ జీవితంపై సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో పలువురు సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సెలబస్: స్వదండకం
కథ, మాటల రచయితగా, దర్శకుడిగా... తెలుగు, కన్నడం, తమిళ సినీ రంగాల్లో తనదైన ముద్ర వేశారు జనార్దన మహర్షి. కవిగా తన కలం నుంచి ఎన్నో అక్షర సుమాలను వెదజల్లారు. మహర్షి ఫ్లూటిస్ట్ కూడా! వీణ, వయొలిన్లపై సంగీతాన్ని పలికించే తన ఇద్దరు కూతుళ్లతో కలిసి త్వరలో ఒక కచేరీ ఇవ్వాలన్నది ఆయన లక్ష్యం. ప్రియాతి ప్రియమైన పద్మశ్రీ ‘భారతరత్న’ నాకు నేను రాసుకొను ప్రేమలేఖ ఇదే నా మొదటి ప్రేమలేఖ ఎవ్వరికీ రాయనేలేదింత దాకా. ‘నీ’ ప్రేమలో పడి ‘నాకే’ రాస్తున్నా. నన్నడిగారు... ‘నీకెవరంటే ఇష్టమని’ ‘నేనే’ అన్నాను. అంతేకదా... రాజకీయాలైనా రాసక్రీడలైనా, రచనలైనా, సం‘గీతా’లైనా అరువది నాలుగు కళల్లో ఎవడైనా నాకు ఇష్టంగా ఉండాలంటే ముందు వాటిని ఇష్టపడే నాకు నేను ఇష్టుడిగా ఉండాలి కదా! ‘ఎలా ఉన్నావ్’ అని అడిగాడతను ‘నువ్వెలా కోరుకుంటే అలా’ అన్నాను. నాకు నేనెందుకింత ఇష్టమో చెప్పాను ఎందుకంటే... నే స్వయంభుని విల్లంభుని... హయంభుని... జయంభుని నేను తెరిచిన నగలపెట్టెని ఎవరైనా ధరించొచ్చు కానీ నిష్ర్కమించేటప్పుడు నేలపైన, నెలరాజు లాంటి నన్నూ, పెట్టెని వదిలివెళ్లు. పెకైళితే... నగల నగరమే ఉందిగా సూర్యుడికీ చంద్రుడికీ తెలీని సంధి సమయంలో నేను భయాన్ని ఉరివేసి, దుఃఖాన్ని ఎన్కౌంటర్ చేసి, నిరాశకి తలకొరివి పెట్టాను. ఇది మీకూను లాభసాటి. తిరుగులేని ‘తిక్క’ నా సొంతం గొడుగు తడుస్తుందని వర్షంలో విప్పను చెప్పు కాలుతుందని ఎండలో తొడగను ఎందుకిలా అంటే... అంటాను ‘చెప్పు’నేనే... ‘ముళ్లు’ నేనే... ‘వర్షం’ నేనే తడిస్తే వచ్చే జలుబు నేనే. మందు చిటీ రాసే వైద్యుణ్ని, దాన్ని వాడక చింపే పేషెంట్‌ని, అన్నీ నేనే... అదే ‘నువ్వే’నని! హరిని... కరిని... కరిమింగిన వెలగని వెలగ మొలచిన చెట్టుని పెరిగే దేహాన్ని, తరిగే శరీరాన్ని అన్నీ ‘నేనే’... ‘నువ్వే’నని. అత్యధిక అపజయాలని సాధించడంలో నీ అంత విజయుడు లేడు నేనెంత పాతాళంలో ఉన్నానంటే భూమ్మీద ఉన్న మనుషులు నాకు ఆకాశం ఎత్తులో ఉంటారు ఆత్మహత్య చేసుకుందామనే వాళ్లందరూ కూడా నీతో నాలుగు నిమిషాలు గడిపితే... వీడే బతికేస్తున్నాడనే ధైర్యంతో నిండు నూరేళ్లు మిగులుతారు. ఆఖరుగా ఓ మాట. నీకు నేను చెప్పేదేంటంటే... ‘‘ఇష్టం లేకపోతే... ఉలక్కు... పలక్కు... అంతేగానీ కెలక్కు’’... అంతే నేనెప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటా.