కిస్సింగ్ ఇప్పుడు కామన్!
Published Sat, Nov 30 2013 12:57 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘‘ముద్దుని ఎందుకలా బూతద్దంలో చూస్తారు. ఇష్టాన్ని ప్రదర్శించే విషయంలో ముద్దు ఒక సాధనం. అంతేతప్ప అది తప్పు పనేం కాదు’’ అంటున్నారు బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపిక పదుకొనే. ఇటీవల వెంటవెంటనే జరిగిన రెండు పార్టీల్లో ఇద్దరు సినీ ప్రముఖులు ఈ అందాల భామను గాఢ చుంబనాలతో ముంచెత్తారు. ఈ ముద్దుల ప్రహసనం బాలీవుడ్‌లో పెద్ద చర్చకే దారితీసింది. వివరాల్లోకెళితే... హోమీ అడ్జానియా దర్శకత్వంలో దీపిక పదుకొనే నటించిన ‘ఫైండింగ్ ఫన్నీ ఫెర్నాండెజ్’ చిత్రం వచ్చే ఏడాది జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా... సినిమాకు సంబంధించిన మీడియా సమావేశం ఇటీవల ముంబయ్‌లో నిర్వహించారు.
తదనతరం జరిగిన పార్టీలో అందరి సమక్షంలో దీపికాను గట్టిగా ముద్దుపెట్టేసుకున్నారట హోమీ. దీపిక కూడా దాన్ని లైట్‌గానే తీసుకున్నారు. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్లే హోమీ అలా ప్రవర్తించారని అందరూ అక్కడ చెవులు కొరుక్కున్నారు. ఆ మరుసటి రోజే... దీపికా రీసెంట్ హిట్ ‘రామ్‌లీలా’ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ వేడుకలో సదరు చిత్ర కథానాయకుడు రణవీర్‌సింగ్... వెనుకాలే వచ్చి... దీపికాను గట్టిగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తేశారు. ఆ హఠాత్ పరిణామానికి ముందు భయపడిపోయిన దీపిక... తర్వాత రణవీర్‌ని చూసి సిగ్గుల మొగ్గ అయిపోయారట. కాగా... దీపికా ముద్దుల పరంపర ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమైంది.
వీటిని ఆధారంగా తీసుకొని కథనాలు కూడా ప్రసారం అవుతున్నాయి. దాంతో ఖంగుతిన్న దీపిక ఘాటుగా స్పందించారు. -‘‘సమాజం వేగంగా దూసుకుపోతోంది. మడికట్టుకొని కూర్చునే రోజులు కావివి. కిస్ చేసుకోవడం ప్రస్తుతం కామన్. అభిమానించేవారు, అయిన వారు ఇష్టాన్ని ప్రదర్శిస్తున్న రీతి ఇది. దాన్ని తప్పుపడితే ఎలా. ఏదైనా మనం చూసే తీరుపై ఆధారపడి ఉంటుంది. తోబుట్టువుల్ని, స్నేహితుల్ని మనం ముద్దు పెట్టుకోవట్లేదా. అప్పుడు కనిపించని తప్పు నా విషయంలో ఎందుకు కనిపించింది’’ అని వాపోయారు.
Advertisement
Advertisement