దీపిక వెడ్డింగ్‌ రింగ్‌ ఖరీదు ఎంతంటే.. | Deepika Padukones Wedding Ring Has A Giant Rock | Sakshi
Sakshi News home page

దీపిక వెడ్డింగ్‌ రింగ్‌ ఖరీదు ఎంతంటే..

Published Fri, Nov 16 2018 2:14 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Deepika Padukones Wedding Ring Has A Giant Rock - Sakshi

సాక్షి, ముంబై : వివాహ బంధంతో ఒక్కటైన బాలీవుడ్‌ హాట్‌ కపుల్‌ దీపికా పడుకోన్‌, రణ్‌వీర్‌ సింగ్‌లకు బాలీవుడ్‌ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ఇటలీలో అత్యంత ఆర్భాటంగా జరిగిన వివాహ వేడుక బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. పెళ్లిలో దీపిక ధరించిన ఓ రింగ్‌ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

భారీ డైమండ్‌ పొదిగిన ఈ ఉంగరం వెడ్డింగ్‌ లేదా ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ అయి ఉంటుందని భావిస్తున్నారు. భారీ సైజ్‌లో ఉన్న ఈ రింగ్‌ ధర ఖరీదు వింటే షాక్‌ తినాల్సిందే. ఈ రింగ్‌ ధర రూ 1.3 నుంచి 2.7 కోట్లు ఉంటుందని బాలీవుడ్‌లైఫ్‌ పోర్టల్‌ పేర్కొంది. ఈ రింగ్‌ ధర రూ కోటిపైగానే పలుకుతుందని చెబుతున్నారు. దీపిక వేళ్లకు పలు రింగ్‌లున్నా భారీ డైమండ్‌తో రూపొందిన ఈ రింగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

దీపిక, రణ్‌వీర్‌ల పెళ్లి వేడుక నవంబర్‌ 14, 15 తేదీల్లో ఇటలీలో సింధ్‌, కొంకణ్‌ సంప్రదాయాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా వీరిమధ్య సాగిన అనుబంధం పెళ్లి పీటలకు చేరడంతో బాలీవుడ్‌ ప్రముఖులంతా కొత్త జంటను అభినందనల్లో ముంచెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement