
ఔను.. ప్రేమలో పడ్డాను
బాలీవుడ్ జంట రణ్వీర్ సింగ్, దీపిక పదుకొన్ పీకల్లోతు ప్రేమలో ముగినితేలుతున్నట్టు కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తరచూ సినిమా ఫంక్షన్లు, పార్టీల్లో ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తుంటారు. రణ్వీర్, దీపిక అనుబంధం బాలీవుడ్లో హాట్ టాపిక్. అయితే తమ అనుబంధం గురించి ఈ జంట ఇప్పటి వరకు ఔనని కానీ కాదని కానీ చెప్పలేదు.
రణ్వీర్ తన అనుబంధం గురించి ఇటీవల నోరు విప్పాడు. తాను ప్రేమలోపడ్డానని, ఒకరితో అనుబంధముందని రణ్వీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సిన్సియర్గా ప్రేమిస్తున్నానని వెల్లడించాడు. తమ అనుబంధం బాగుందని, ఇలాంటి అనుభూతి గతంలో ఎప్పుడూ చవిచూడలేదన్నాడు. ఇంకేముంది రణ్వీర్ ప్రేయసి దీపికేనని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. రణ్‌వీర్‌సింగ్, దీపిక నటించిన బాజీరావు మస్తానీ విజయం సాధించడంతో ఈ జంట మంచి జోష్తో ఉన్నారు. కాగా గతంలో దీపిక కొందరితో ఎఫైర్ సాగించినట్టు వార్తలు వచ్చాయి. ఈ జాబితాలో మరో బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ పేరు కూడా ఉంది.