ఔను! దీపిక కన్ఫర్మ్ చేసింది!! | Deepika finally uses the B-word for Ranveer. Yes, you read it right! | Sakshi
Sakshi News home page

ఔను! దీపిక కన్ఫర్మ్ చేసింది!!

Published Wed, Jan 20 2016 6:58 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఔను! దీపిక కన్ఫర్మ్ చేసింది!! - Sakshi

ఔను! దీపిక కన్ఫర్మ్ చేసింది!!

ఇన్నాళ్లు వారిద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కలిసి నటించారు. కలిసి కనిపించారు. ప్రేమపూర్వకంగా హత్తుకుంటూ.. ఫొటోలకు పోజులిచ్చారు. మీడియా వారి గురించి ఎన్నో రాసింది. ఆ వార్తలను తిరస్కరించలేదు. అంగీకరించనూలేదు. కానీ వారి నోటి నుంచి ఎన్నడూ 'అనుబంధం', బాయ్‌ఫ్రెండ్ (ప్రియుడు), గర్ల్‌ఫ్రెండ్‌ (ప్రియురాలు) లాంటి మాటలు రాలేదు. కొన్ని సంవత్సరాలుగా వారిద్దరి మధ్య అనుబంధం కొనసాగుతున్నదని తెలుసు. ఎన్నో ఇంటర్వ్యూలు కలిసి ఇచ్చారు. మీడియా ముందు చిలుకా గోరింకల్లా ముద్దుముద్దుగా కలిసి తిరిగారు.

ఇన్నాళ్లకు ఆ జంట ఈ సస్పెన్స్‌ తెరదించారు. వారే బాలీవుడ్ హిట్‌పెయిర్‌గా పేరొందిన ప్రేమజంట రణ్‌వీర్ సింగ్‌‌, దీపికా పదుకొనె. ఇటీవల ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో దీపిక, రణ్‌వీర్ ఇద్దరికీ అవార్డులు దక్కాయి. ఈ వేడుకలో ఈ జంట కలిసి తిరుగుతూ, గుసగుసలు చెప్పుకొంటూ చాలా హల్‌చల్ చేసింది. ఈ వేడుక ముగిసిన తర్వాత ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన దీపిక ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రణ్‌బీర్ కపూర్‌తో తాను కలసి నటించినప్పుడు రణ్‌వీర్ సింగ్ ఎలా భావిస్తారు? అని ప్రశ్నించగా.. ఈ అంశంలో తన 'బాయ్‌ఫ్రెండ్‌' అభద్రతగా ఫీలవుతాడా? అని తనను అడుగడం ఎంతమాత్రం సబబు కాదని పేర్కొంది. ఈ విషయాన్ని రణ్‌వీర్‌సింగ్‌నే అడుగాలని చెప్పింది. మొత్తానికి తొలిసారి రణ్‌వీర్‌ గురించి 'బాయ్‌ఫ్రెండ్‌' పదాన్ని వాడి.. తమ అనుబంధాన్ని దీపిక కన్ఫర్మ్ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement