
చెన్నై, పెరంబూరు: సన్నిలియోన్ చిత్రంపై పిటిషన్‌ను చెన్నై హైకోర్టు శాఖ, మధురై కోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్లితే శృంగార తారగా ముద్రపడిన బాలీవుడ్ నటి సన్నిలియోన్ ప్రధాన పాత్రలో తమిళం, హిందీ అంటూ పలు భాషల్లో వీరమదేవి పేరుతో భారీ చారిత్రక కథా చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నటి సన్నిలియోన్ వీరమదేవిగా నటిస్తోంది. దీంతో మదురై, సెల్లూరుకు చెందిన సరవణన్ అనే న్యాయవాది వీరమదేవి చిత్రానికి వ్యతిరేకంగా చెన్నై హైకోర్టు శాఖ, మధురై కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం కింద పిటిషన్ దాఖలు చేశారు.
అందులో ఆయన పేర్కొంటూ రాజేంద్రచోళన్‌ను భార్య రాణి వీరమదేవి వీరనారి అని పేర్కొన్నారు. ఆమె ఇతివృత్తంతో వీరమదేవి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిపారు. అందులో వీరమదేవిగా శృంగార తారగా ముద్ర పడ్డ నటి సన్నిలియోన్ నటిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె ఆ పాత్రలో నటించడం వీరమదేవిని అవమానించడమేనన్నారు. కాబట్టి ఆ పాత్రనుంచి నటి సన్నిలియోన్‌ను తప్పించాలని, లేని పక్షంలో వీరమదేవి చిత్ర నిర్మాణాన్ని నిలిపివేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు సుందరేశ్, ఎన్.సతీశ్‌కుమార్‌ల సమక్షంలో విచారణకు రాగా దీన్ని ప్రజాహిత వ్యాజ్యం కింద విచారణకు స్వీకరించలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దీంతో సన్నిలియోన్ చిత్ర విడుదలకు ఆటంకాలు తొలిగాయి.