భార్యకు ప్రేమతో మహేశ్‌ స్పెషల్‌ ఫొటో! | Mahesh Babu expresses his gratitude towards Namrata Shirodkar | Sakshi
Sakshi News home page

భార్యకు ప్రేమతో మహేశ్‌బాబు స్పెషల్‌ ఫొటో!

Published Mon, Apr 23 2018 7:25 PM | Last Updated on Mon, Apr 23 2018 7:58 PM

Mahesh Babu expresses his gratitude towards Namrata Shirodkar - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు తాజా సినిమా ‘భరత్‌ అనే నేను’  సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. సామాజిక బాధ్యతతో జనహితం కోసం పనిచేసే ముఖ్యమంత్రిగా ఈ సినిమాలో మహేశ్‌ అదరగొట్టారు. మరోసారి దర్శకుడు కొరటాల శివ తనదైన కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో సామాజిక అంశాలను తెరకెక్కించి విజయవంతమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. రెండురోజుల్లోనే రూ. 100 కోట్లకుపైగా గ్రాస్‌ సాధించింది.

ఈ భారీ విజయాన్ని మహేశ్‌ ఆస్వాదిస్తున్నారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యమిచ్చే మహేశ్‌ ఈ సినిమా విజయాన్ని కుటుంబసభ్యులతో పంచుకున్నారు. తన సతీమణి నమ్రతకు తన ప్రేమను చాటే ఓ అందమైన ఫొటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్‌, నమ్రత లిప్‌లాక్‌ చేస్తూ ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement