
సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రపంచ దేశాల పర్యటనను ముగించుకుని తిరిగి ఇండియాకు రానున్నారు. ఇన్నిరోజులు విదేశాల్లో ఎంజాయ్ చేసిన ఈ ఫ్యామిలీ వారి చివరి రోజును మరింత సరదాగా గడిపినట్టు తెలుస్తోంది. చివరి రోజున దుబాయ్‌లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా వీరితో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ పిక్‌ను నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా దుబాయ్‌కు వెళ్లిన ప్రిన్స్ ఫ్యామిలీ.. అక్కడ సరదాగా గడిపారు. మధ్యలో ఇక్కడ ట్యాక్స్‌లు కట్టలేదంటూ నాన హంగామా జరుగుతోన్న.. మహేష్ అక్కడ మాత్రం హ్యాపీగానే ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఆ విషయం సద్దుమణిగిందనుకోండి అది వేరే విషయం. అయితే తమ ఇన్ని రోజుల హాలిడే ట్రిప్‌కు శుభం కార్డం పడింది. ఇక ఇండియాకు తిరుగు ప్రయాణం అవుతున్నట్లు తెలుస్తోంది. చివరి రోజున వీరితో సానియా మీర్జా తోడవ్వడంతో ఈ పిక్‌కు మరింత అందం వచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే మహర్షి షూటింగ్‌లో మహేష్ జాయిన్ కానున్నాడు.