
ఒక హీరో లుక్, కీలకమైన సీన్‌లో హీరో చెప్పే డైలాగ్స్.. ఇలా సినిమాలో ప్రతిదాని వెనకా టీమ్ కష్టం చాలానే ఉంటుంది. కానీ వారి కష్టాన్ని కొందరు ఆకతాయి యువకులు ఇట్టే సెల్‌ఫోన్ పాలు చేస్తున్నారు. అవును.. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షి’ సినిమాకు చెందిన ఓ స్మాల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ‘మహర్షి’ టీమ్ షాక్ అయ్యింది. ఇక సెట్‌లోకి సెల్‌ఫోన్‌కి చెల్లు చెప్పాలని స్ట్రిక్ట్ రూల్‌ను పెట్టుకున్నారని తెలిసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్రధారి. స్టూడెంట్‌గా, బిలియనీర్‌గా, రైతుగా ఈ సినిమాలో మహేశ్ కనిపిస్తారట.
రిషి పాత్రలో మహేశ్, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్ కనిపిస్తారు. ఇటీవల ఈ సినిమా పొల్లాచ్చి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారంలో ఆరంభం కానుంది. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. మహేశ్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా అప్పుడు కూడా ఆయన లుక్ అధికారికంగా రిలీజ్ చేయడానికి ముందే నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment