‘భరత్ అనే నేను’ మూవీ సక్సెస్ జోష్‌ను ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు మహేశ్‌బాబు. అలాగే రెండు సినిమాలను కూడా ఆయన లైన్లో పెట్టారు. వంశీ పైడిపల్లితో ఓ సినిమా, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం మహేశ్ హాలీడేను ఎంజాయ్ చేస్తూ స్పెయిన్‌లో ఉన్నారు. ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ వెళ్లి పది రోజుల పైనే అవుతోంది. మరి.. ఇండియా ఎప్పుడు వస్తారు? అంటే, జూన్ 9న అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే.. వంశీపైడి పల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు నటించనున్న సినిమాపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
అదేంటంటే.. ఇది ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో యూఎస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతూనే రాయలసీమ టచ్ ఉంటుందట. అంతేకాదు ఈ సినిమాలో మహేశ్‌బాబు కొన్ని సీన్స్‌లో గుబురు గడ్డం, మీసాలతో కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారన్న సంగతి తెలిసిందే. ముందు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటించనున్న సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళుతుంది.
గుబురు గడ్డం.. కోర మీసం!
Published Wed, May 23 2018 12:22 AM | Last Updated on Tue, May 28 2019 10:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment