
ఫస్ట్ టైమ్ బియర్డ్ లుక్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు కనిపించనున్నాడని మహర్షిపై అమాంతం అంచనాలు పెంచేశారు. ఇంతవరకు అలాంటి గెటప్ ట్రై చేయని మహేష్ ఎలా ఉంటాడా అని.. ప్రిన్స్ కోసం కెమెరా కళ్లు వెంటబడ్డాయి. అయితే ఈ చిత్రంలో పూర్తి స్థాయిలో గడ్డంతో మహేష్ కనిపించడని.. తెలిసిపోయింది.
అయితే మహేష్ ఈమాత్రం గడ్డంతో కూడా ఇంతవరకు ఏ సినిమాలో కనిపించలేదు కదా.. అని అభిమానులు సంబరపడిపోయారు. కానీ అది కూడా సినిమాలో పూర్తి స్థాయిలో ఉండదని కొంతభాగమే అలా లైట్‌గా గడ్డంతో కనిపిస్తాడని అభిమానులు నిరాశచెందారు. అయితే ఆ మధ్య స్టైలీష్ లుక్‌లో ఉన్న మహేష్ పిక్స్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో పెద్ద వ్యాపారవేత్తలా చాలా హుందాగా కనిపించాడు.
అయితే ఈరోజు రివీల్ అయిన మహేష్ లుక్ ద్వారా అభిమానుల్లో మళ్లీ చర్చ మొదలైంది. నేడు మహేష్ సతీమణి నమ్రత పుట్టినరోజు. నమ్రతా, మహేష్ కలిసి ఉన్న పిక్‌ను పోస్ట్ చేస్తూ.. బర్త్ డే విషెస్ తెలిపాడు. అయితే ఈ పిక్‌లో మహేష్ మరింత అందంగా, కొత్తగా కనిపించే సరికి ఇది మహర్షిలోని మరో లుక్ అయి ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇంతకీ.. మహర్షిలో మహేష్ ఎలా కనబడతాడు అనేది సినిమా విడుదలైతే గానీ చెప్పలేం. సో.. సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. కొద్దిసేపటి క్రితమే దిల్‌రాజు ఈ మూవీని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.