ఆ పాట ప్రత్యేకం! | Manchu Lakshmi's Dongata Telugu Movie Logo Launched | Sakshi
Sakshi News home page

ఆ పాట ప్రత్యేకం!

Published Sun, Mar 1 2015 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

ఆ పాట ప్రత్యేకం!

ఆ పాట ప్రత్యేకం!

పది మంది హీరోలు ఒకేసారి తెరపై కనిపిస్తే, ఆ మజాయే వేరు. ప్రేక్షకులకు ఆ కిక్‌ను పంచనున్న చిత్రం ‘దొంగాట’.  మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఎస్.వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మీ నిర్మిస్తున్న చిత్రం ఇది. అడివి శేష్, మంచు లక్ష్మీ నటిస్తున్న  ఈ చిత్రం లోగోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. లక్ష్మీ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి కీలకంగా నిలిచే ప్రత్యేక పాట ఒకటుంది. అందులో నటించడానికి నాగార్జున, రవితేజ, నాని, మనోజ్, రానా, శింబు, నాని, నవదీప్, సుధీర్‌బాబు, సుశాంత్ ఒప్పుకున్నారు’’ అని చెప్పారు. ‘‘నా గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో కామెడీ ట్రై చేశా. ప్రేక్షకులకు  మంచి వినోదాన్ని పంచుతుంది’’ అని  అడివి శేష్ అన్నారు.  ఈ చిత్రానికి సహనిర్మాత: గాంధీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement