మూడేళ్ల తర్వాత మరోసారి.. | Manchu Manoj New Movie Aham Brahmasmi Details Announced | Sakshi
Sakshi News home page

మూడేళ్ల తర్వాత మరోసారి..

Published Thu, Feb 13 2020 9:11 AM | Last Updated on Thu, Feb 13 2020 9:17 AM

Manchu Manoj New Movie Aham Brahmasmi Details Announced - Sakshi

వ్యక్తిగత కారణాలతో కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరో మంచు మనోజ్‌ అభిమానులకు శుభవార్త చెప్పారు. ఇటీవల ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించనున్నట్టు తెలిపిన మనోజ్‌.. తన కొత్త సినిమా గురించిన వివరాలను గురువారం వెల్లడించారు. అందుకు సంబంధించిన ఓ పోస్ట్‌ర్‌ను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. 3 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్నానని మనోజ్‌ ఈ సందర్భంగా తెలిపారు. తన తొలి సినిమా ‘దొంగ దొంగది’ సమయంలో ఎలాంటి భావోద్వేగంతో ఉన్నానో ఇప్పుడు అలాంటి అనుభూతితోనే ఉన్నానని అన్నారు.

‘మూడేళ్ల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. నా తొలి సినిమా ‘దొంగ దొంగది’కి ఎలాంటి ఎమోషన్‌కు లోనయ్యానో ఇప్పుడు అలానే ఫీల్‌ అవుతున్నాను. నా జీవితమైన నా కళను మిస్సయ్యాను. సినీ అమ్మ వచ్చేశా. లవ్‌ యూ డార్లింగ్స్‌’ అని మనోజ్‌ పేర్కొన్నారు.  

కాగా, మనోజ్‌ సొంత బ్యానర్‌ మంచు మనోజ్‌ ఆర్ట్స్‌(ఎంఎం ఆర్ట్స్‌) బ్యానరపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విద్య నిర్వాణ మంచు ఆనంద్‌ సమర్పణలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. మంచు మనోజ్‌, ఆయన తల్లి నిర్మల దేవి నిర్మాతలుగా ఉండనున్నారు. ఈ చిత్రం మార్చి 6వ తేదీన ప్రారంభం కానుంది.

చదవండి : రెండో పెళ్లిపై మనోజ్‌ ఆసక్తికర కామెంట్‌..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement