కామెడీనే నమ్ముకున్న మంచు వారబ్బాయి | Manchu vishnu next film eedo rakam aado rakam | Sakshi
Sakshi News home page

కామెడీనే నమ్ముకున్న మంచు వారబ్బాయి

Published Wed, Mar 30 2016 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

కామెడీనే నమ్ముకున్న మంచు వారబ్బాయి

కామెడీనే నమ్ముకున్న మంచు వారబ్బాయి

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు వారబ్బాయి, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా కెరీర్ను మలుపు తిప్పే భారీ బ్లాక్ బస్టర్ అందించటంలో మాత్రం వెనకపడ్డాడు. మొదట్లో ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాల మీద దృష్టిపెట్టిన విష్ణు, అవి పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో కామెడీ టర్న్ తీసుకున్నాడు. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా సినిమాలతో మంచి విజయాలు సాధించి సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు.

అయితే ఈ సక్సెస్ల తరువాత మరోసారి మాస్ ఇమేజ్ మీద మనసుపడి, యాక్షన్ సినిమాలు చేసే ప్రయత్నం చేశాడు. అనుక్షణం, రౌడీ లాంటి సినిమాలతో పరవాలేదనిపించినా, మాస్ హీరో ఇమేజ్ మాత్రం సాధించలేకపోయాడు. డైనమైట్ సినిమాతో యాక్షన్ హీరోగా స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన విష్ణు, ఇప్పుడు మరోసారి కామెడీ సినిమానే నమ్ముకుంటున్నాడు.

యంగ్ హీరో రాజ్ తరుణ్తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. కామెడీ సినిమాల స్పెషలిస్ట్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఈడో రకం ఆడో రకం' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆడియో రిలీజ్ అయిన ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement