ఓకె బంగారం సక్సెస్ తరువాత మణిరత్నం చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇప్పటికే కార్తీ, దుల్కర్ సల్మాన్ లు హీరోలుగా సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను రివేంజ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇద్దరు యంగ్ హీరోలు కలిసి నటిస్తుండటంతో, ఈ మూవీ గతంలో మణిరత్నం తెరకెక్కించిన 'అగ్ని నక్షత్రం' స్ఫూర్తితో రూపొందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
1988లో రిలీజ్ అయిన అగ్నినక్షత్రం సినిమాలో అమలా, నిరోషాలు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ కొత్త సినిమా కోసం 'ఇదు ఎన్న మాయం' ఫేం కీర్తి సురేష్ను ఒక హీరోయిన్గా ఎంపిక చేయగా మరో హీరోయిన్ కోసం ఇంకా వేట కొనసాగుతోంది. ప్రస్తుతానికి మణి ఇంకా 'ఓకె బంగారం' సక్సెస్ ను ఎంజాయ్ చేసే మూడ్లోనే ఉన్నాడు. అక్టోబర్ 1 నుంచి సౌత్ కొరియాలో జరగనున్న బుసాన్ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 'ఓకె బంగారం' ను ప్రదర్శిస్తున్నారు. బుసాన్ ఆసియాలోనే అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్ కావటంతో మణి ఆ ఏర్పాట్లలో మునిగిపోయాడు.
ఈ హడావిడి పూర్తవ్వగానే కార్తీ, దుల్కర్ ల కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా మీద దృష్టి పెట్టనున్నాడు. తమిళంలో చాలా కాలం తరువాత వస్తున్న మల్టీ స్టారర్ సినిమా కావటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా మణి చిత్రం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
'అగ్ని నక్షత్రం' ఇన్ స్పిరేషన్ తో మణి సినిమా!
Published Fri, Aug 28 2015 2:01 PM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM
Advertisement
Advertisement