మళ్లీ పెళ్లి? | Manisha Koirala expresses her desire to adopt a girl child | Sakshi
Sakshi News home page

మళ్లీ పెళ్లి?

Published Sun, Sep 11 2016 10:46 PM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

మళ్లీ పెళ్లి? - Sakshi

మళ్లీ పెళ్లి?

మంచి వ్యక్తి తారసపడితే మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తానని మనీషా కొయిరాలా అన్నారు. ఈ నేపాలీ భామ ఆరేళ్ల క్రితం స్వదేశానికి చెందిన వ్యాపారవేత్త సామ్రాట్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత రెండేళ్లకు విడాకులు తీసు కున్నారు. క్యాన్సర్‌ను జయించిన మనీషా ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నారు. గతేడాది తమిళంలో ఓ సినిమా చేశారు.
 
  హిందీలో ‘డియర్ మాయ’, ‘మౌలాలి’ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. వ్యక్తిగత జీవితం గురించి మనీషా మాట్లాడుతూ - ‘‘వచ్చే ఏడాది ఓ అమ్మాయిని దత్తత తీసుకోవాలనుంది. నా కుటుంబ సభ్యులు నేపాల్‌లో ఉంటారు. ముంబయ్‌లో సెటిలయ్యాక ఒంటరిగా ఫీలవుతున్నా. ఓ మనిషి తోడు అవసరం అనిపించింది. అందుకే ఎవరినైనా దత్తత తీసుకోవాలని ఉంది. పెళ్లి కంటే ముందు దత్తత తీసుకోవాలనుకుంటున్నా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement