మన్మథుడు క్రేజ్‌ మామూలుగా లేదు! | Manmadhudu 2 Makes a Decent Pre Release Business | Sakshi
Sakshi News home page

మన్మథుడు క్రేజ్‌ మామూలుగా లేదు!

Published Thu, Jul 25 2019 10:12 AM | Last Updated on Thu, Jul 25 2019 10:14 AM

Manmadhudu 2 Makes a Decent Pre Release Business - Sakshi

కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్‌ సరసన రకుల్ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్‌ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతుంది.

గతంలో సూపర్‌ హిట్ అయిన మన్మథుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా శాటిలైట్, డిజిటల్‌ రైట్స్ ఇప్పటికే అమ్ముడయినట్టుగా తెలుస్తోంది. డిజిటల్‌ రైట్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ 7కోట్లకు పైగా ఆఫర్‌ చేసి దక్కించుకుంది. హిందీ డబ్బింగ్ రైట్స్‌ 6 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకోగా శాటిలైట్‌ రైట్స్‌ కూడా భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement