
వెబ్ డెస్క్ : ‘మార్క్ శంకర్ పవనోవిచ్’ ఇతనెవరో తెలుసా?. పవన్ కళ్యాణ్‌కు నాలుగో సంతానంగా అన్నా లెజినోవాకు జన్మించిన బాబుకు పెట్టిన పేరు. ఈ పేరును విన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాసేపు ఆశ్చర్యపోయారు. తర్వాత ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు. భాషల పుట్టుక తర్వాత తాను విన్న పేర్లలో అతి గొప్పది ఇదేనని అన్నారు.
క్రైస్తవ మత ఆరంభానికి ముందు కాలం నాటి నుంచి.. అసలు మనుషులు సంభాషించుకోగలరా? అని ఈజిప్టుకు చెందిన పారా సమెథికస్ I పరిశోధనలు చేసిన కాలం నుంచి వెతికినా ఇలాంటి పేరు వినలేదని తన పోస్టులో రాసుకొచ్చారు ఆర్జీవీ. ‘మార్క్ శంకర్ పవనోవిచ్’లో పవన్ ఆరిజినేటర్ శంకర్‌తో పాటు రష్యన్స్‌కు చెందిన ఓవిచ్ కూడా ఉందన్నారు.
కూతురితో మాటల యుద్ధం..
ఆర్జీవీ చేసిన పోస్టుకు ఆయన కూతురు రేవతి వర్మ స్పందించారు. ‘మీరు చేసిన పోస్టులో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఊసుపోక సామాన్యులకు అందని పదాలతో పోస్టులు చేయడం సరికాదు. అసలు ఆ చరిత్రకు పేరుకు పొంతన ఏముంది?.’ అని కామెంట్ చేశారు.
రేవతి కామెంట్‌పై స్పందించిన ఆర్జీవీ.. ‘మీకు అర్థం చేసుకోవడం రాదని మీరు చేసిన కామెంట్ చెబుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్‌ను నేను ప్రేమిస్తున్నాను. మీకంటే నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించినంతగా పవన్‌ను మీరు ప్రేమించలేరు’. అని రేవతి చేసిన కామెంట్‌కు సమాధానం ఇచ్చారు ఆర్జీవీ. అనంతరం ఈ సంభాషణ మొత్తాన్ని మరో పోస్టు కూడా చేశారు.