విజయానందంలో మీసైమురుక్కు యూనిట్‌ | Meesimuruku film is a great reception from the audience | Sakshi
Sakshi News home page

విజయానందంలో మీసైమురుక్కు యూనిట్‌

Published Wed, Jul 26 2017 2:45 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

విజయానందంలో మీసైమురుక్కు యూనిట్‌

విజయానందంలో మీసైమురుక్కు యూనిట్‌

తమిళసినిమా: మీసైమురుక్కు చిత్ర యూనిట్‌ విజయానందంలో మునిగి తేలుతోంది. దర్శకుడు సుందర్‌.సీ తన అవ్నీ మూవీస్‌ పతాకంపై నిర్మించిన చిత్రం మీసైమురుక్కు. హిప్‌హాప్‌ తమిళా తొలిసారిగా దర్శకత్వం చేపట్టి, కథాయకుడిగా నటించి, సంగీతం  అం దించిన చిత్రం ఇది. నటి ఆద్మియ కథానాయకిగా నటించిన ఇందులో మాళవిక, విఘ్నేశ్‌కాంత్, సా రా, ఆనంద్, వినోద్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం గత శుక్రవారం తెరపైకి వచ్చింది. చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సోమవారం సాయంత్రం  చెన్నైలో సక్సెస్‌మీట్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా మీసైమురుక్కు చిత్ర నిర్మాత సుందర్‌.సీ మాట్లాడుతూ ఈ చిత్ర విజయంపై తనకు ముందు నుంచి నమ్మకం ఉందన్నారు. ఇదే విషయాన్ని తాను చెబుతున్నా, ఎవరూ నమ్మలేదని, ఇంటర్నెట్‌ కుర్రాళ్లు చేసిన చిత్రం ఏం బాగుంటుందిలే అని చాలా మంది పరిహాసం చేశారన్నారు. అలాంటి వారే మీసైమురుక్కు చిత్రం విజయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు. నిజానికి తానూ ఈ చిత్రం ఏ సెంటర్స్‌ చిత్రం అనుకున్నానని, ఇప్పుడు చూస్తే ఏబీసీ అనే తారతమ్యం లేకుండా అన్ని సెంటర్లలోనూ వసూళ్లు రాబడుతోందని సుందర్‌.సీ పేర్కొన్నారు. కార్యక్రమంలో హిహ్‌హప్‌ తమిళ, నటి ఆద్మియ, చిత్రయూనిట్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement