
సాక్షి,ముంబయి: సినిమాల్లో అవకాశాల కోసం హీరోయిన్లను లోబరుచుకునే (కాస్టింగ్ కౌచ్) సంస్కృతిపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రియాంక ప్రస్తావిస్తూ దీనికి పురుషులూ బాధితులేనని వ్యాఖ్యానించారు. టాలెంట్ బేస్డ్ రియాలిటీ షో ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్స్ వేదికపై ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక వాదనను ఈ షోను హోస్ట్ చేసే రిత్విక్ ధన్‌జాని సమర్ధించారు.
కొత్తగా పరిశ్రమకు వచ్చే వారిని కిందిస్ధాయి వ్యక్తులే ఈ రకంగా వేధింపులకు గురిచేస్తారని, పెద్ద దర్శకులు, నిర్మాతలు ఎప్పుడూ ఇలాంటి చేష్టలకు దూరంగా ఉంటారని చెప్పుకొచ్చారు. అదృష్టవశాత్తూ తాను పరిశ్రమలోని మంచి వ్యక్తులతోనే పనిచేశానన్నారు. ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్స్ షోకు బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్లు కరణ్ జోహార్, రోహిత్ శెట్టి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. స్టార్ ప్లస్‌లో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment