
...అని అప్పటి దాకా దెబ్బలాడుకున్న కంగనా రనౌత్ అండ్ రాజ్‌కుమార్ రావు సడన్‌గా ప్లేట్ ఫిరాయించి నీకంటే నాకే పిచ్చి ఎక్కువ అని వాదించుకుంటున్నారు. కానీ ఇదంతా సరదాగానే. మరి.. వీరిద్దరి మెంటల్ లెవల్ చూడాలంటే మాత్రం ‘మెంటల్ హై క్యా’ సినిమా చూడాల్సిందే. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావు, అమైరా దస్తూర్ ముఖ్య తారలుగా నటిస్తున్న ‘మెంటల్ హై క్యా’.
ఈ సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు తన నెక్ట్స్ సినిమాలో కంగనా రనౌత్ కబడ్డీ ప్లేయర్‌గా నటించబోతున్నారని బీటౌన్ టాక్. జాతీయ స్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట.
Comments
Please login to add a commentAdd a comment