![Mithali Raj Says Priyanka Chopra Opt For My Role In Biopic - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/10/Priyanka-Chopra.jpg.webp?itok=V05pBQ3r)
సినీ పరిశ్రమలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. క్రీడాకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు కూడా మంచి విజయాల్ని సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పడు ఆ జాబితాలో భారత మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ చేరబోతున్న సంగతి తెలిసిందే. మహిళ క్రికెట్‌లో మిథాలీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిథాలీ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. తన బయోపిక్ త్వరలో ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఆ చిత్రంలో ప్రియాంక చోప్రా తన పాత్రను పోషిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తమ ఇద్దరి వ్యక్తిత్వాలు దాదాపు ఒకేలా ఉంటాయని అన్నారు. నాకు సినిమాల గురించి అంతగా అవగాహన లేదన్నారు. ప్రియాంక ప్రముఖ క్రీడాకారిణి మేరీకోమ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మిథాలీ బయోపిక్ 2019 ఆరంభంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment