బిగ్‌బాస్2 :మరోసారి మోడల్‌ సంజనా ఫైర్‌ | Model Sanjana Fires on Celebrities in Bigg Boss | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్2 :మరోసారి మోడల్‌ సంజనా ఫైర్‌

Published Fri, Jun 15 2018 2:18 PM | Last Updated on Mon, Jun 18 2018 8:04 PM

Model Sanjana Fires on Celebrities in Bigg Boss - Sakshi

హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌-2 షోలో ప్రేక్షకులకు కావాల్సిన మజా ఇప్పుడిప్పుడే లభిస్తోంది.  బిగ్‌బాస్‌ ఆసక్తికరమైన టాస్క్‌లు.. కంటెస్టెంట్‌ల మధ్య మాటల యుద్దం, వారి ఎమోషన్‌తో ఐదో రోజు రసవత్తరంగా ముగిసింది. సామన్యుడి కేటగిరిలో హౌస్‌లోకి వెళ్లిన మోడల్‌ సంజనా మరోసారి తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. తొలి రోజు నుంచే ఉప్పు-నిప్పులా ఉన్న తేజస్వీ, సంజనాలు ఒకరినొకరు తిట్టుకున్నారు. సెలబ్రిటీ అయితే బయట చూయించుకోండి.. ఎక్స్‌ట్రాలు చేస్తే బాగుండదని సింగర్‌ గీతామాధురి వద్ద సంజనా బ్లాస్ట్‌ అయింది. అయితే ఆమె అలా ప్రవర్తిస్తుంటే.. హౌస్‌ మెట్స్‌ స్పందించకపోవడం పట్ల ఎమోషన్‌ అయిన తేజస్వీ ఏడ్చేసింది. ముఖ్యంగా నూతన నాయుడు ప్రవర్తన తనకు నచ్చడం లేదని, అతనితో మాట్లాడనని తేల్చి చెప్పేసింది. ఆయన అన్నీ తనకే తెలిసన్నట్లు ప్రవర్తిస్తున్నాడని కంటతడి పెట్టింది. 

బిగ్‌బాస్‌ ఇచ్చిన ‘నవ్వుతూ అందరినీ మెప్పించాలనే సిక్రెట్‌ టాస్క్‌’ను తేజస్వీ విఫలమయ్యింది. దీంతో ఆమెను కెప్టెన్‌ పోటీకి అనర్హురాలుగా బిగ్‌బాస్‌ ప్రకటించారు. అయితే తేజస్వీ సీక్రెట్‌ టాస్క్‌ ఏమిటంటే.. ముఖ్యంగా తనకు గిట్టని వారిని మెప్పించాలన్నాడు. సంజనా పనులన్నీ తానే చేయాలని, బాబు గోగినేనిని ఫ్యాషన్‌గా రెడీ చేయాలి. కౌశల్‌కు మసాజ్‌ చేయాలి. అమిత్‌కు కోపం వచ్చేలా చేయాలి. గీతా మాధురి మేకప్‌ చెడగొట్టాలని బిగ్‌బాస్‌ సిక్రేట్‌ టాస్క్‌ఇచ్చారు.

ఏడ్చేసిన దీప్తీ సునైనా..
‘చెప్పండి ప్రభూ లగ్జరీ టాస్క్‌’ లో భాగంగా యజమానులు, సేవకుల జట్టుగా కంటేస్టేంట్‌లు విడిపోయిన విషయం తెలిసిందే. ఈ టాస్క్‌లో భాగంగా యజమాని అయిన కిరిటీ దామరాజు దీప్తీ సునైనాతో ఫ్లోర్‌ క్లీన్‌ చేయిస్తూ వచ్చిన పాటను పదేపదే పాటించాడు. దీంతో ఆమె కంటతడి పెట్టింది. వెంటనే ఆమెను ఓదార్చిన కిరిటీ.. ఎందుకు ఏడుస్తున్నావని అడగగా.. తేజస్వీ తనతో దురుసుగా మాట్లాడుతుందంటూ దీప్తీ సునైనా ఏడ్చేసింది. ఆమెను యాంకర్‌ దీప్తీ, శ్యామలు, భానుశ్రీ, కిరిటీ దామరరాజులు ఓదార్చారు. తేజస్వీ, దీప్తీల మధ్య సింగర్‌ గీతామాధురి రాజీ కుదిర్చింది. తేజస్వీ దీప్తీ క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది. 

చెప్పండి ప్రభూ లగ్జరీ టాస్క్‌లో కిరిటీ టీమ్‌ సంజనా టీమ్‌పై 177 పాయింట్లతో విజయం సాధించింది. సంజనా టీమ్‌కు 170 పాయింట్లు వచ్చాయి, సామన్యుడైన నూతన నాయుడిపై సహచరులు యుద్దం ప్రకటించారు. ఆయన గేమ్‌ ఆడుతున్నారనీ.. అంతా తనకే తెలుసున్నట్లు ప్రవర్తిస్తున్నట్లు మూకుమ్మడిగా మాటల దాడి చేయడంతో అలిగిన నూతన నాయుడు డిన్నర్‌ చేయకుండా వెళ్లి పోయాడు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసింది తేజస్వీ.. ఇలా ఐదో ఎపిసోడ్‌ రసవత్తరంగా సాగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement