మోహన్‌బాబు ఇంట్లో విషాదం | Mohan Babu mother Manchu Lakshmamma passed away | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 20 2018 9:22 AM | Last Updated on Thu, Sep 20 2018 4:08 PM

Mohan Babu mother Manchu Lakshmamma passed away - Sakshi

సాక్షి, చిత్తూరు: ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) గురువారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఉన్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. ఆమె భౌతికకాయాన్ని తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు తరలించారు.

మోహన్‌ బాబు, ఆయన కుటుంబసభ్యులు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. లక్ష్మమ్మ మరణవార్త తెలియగానే వారు హుటాహుటిన స్వదేశానికి బయలుదేరారు. శుక్రవారం ఆమె అంత్యక్రియలు తిరుపతిలో జరగనున్నాయి. ఆమె అంత్యక్రియలకు రాజకీయ, సీని ప్రముఖులు హాజరుకానున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement