2020లో మరాక్కర్‌ | Mohanlal shares first look from Marakkar | Sakshi
Sakshi News home page

2020లో మరాక్కర్‌

Published Mon, Dec 24 2018 3:34 AM | Last Updated on Mon, Dec 24 2018 3:34 AM

Mohanlal shares first look from Marakkar - Sakshi

మోహన్‌లాల్‌

సముద్రయానం చేస్తున్నారు మోహన్‌లాల్‌. రీసెంట్‌గా ఆయన హీరోగా నటించిన ‘ఒడియన్‌’ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది కదా. అందుకే హాయిగా హాలీడేని ఎంజాయ్‌ చేస్తున్నారేమో? అని అనుకుంటే పొరపాటే. ఆయన సముద్రయానం చేస్తోంది ‘మరాక్కర్‌: అరబికడల్లింటే సింహం’ అనే సినిమా కోసం. ఈ సినిమాకు మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 16వ శతాబ్దంలో భారతీయ సముద్రతీరంలో కాలికట్‌ రాజు జామెరిన్‌కు, పోర్చగీసు వారికి యుద్ధం జరిగింది (ఇప్పటి కేరళ పాత్రం).

ఈ వార్‌లో ఓ కీలక పాత్ర వహించిన ముస్లిం నేవల్‌ చీఫ్‌ కుంజలి మరక్కార్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని మాలీవుడ్‌ సమాచారం. సునీల్‌ శెట్టి, అర్జున్, ముఖేష్, కీర్తీ సురేష్, కల్యాణి ప్రియదర్శన్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్‌ కోసం దాదాపు అరడజను సెట్లను ప్రిపేర్‌ చేశారు ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు సిరిల్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోందని సమాచారం. తాజాగా ఈ సినిమాలో తన లుక్‌ను రివీల్‌ చేశారు మోహన్‌లాల్‌. ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement