
బాహుబలి విజయానికి అదే కారణం..
సినీనటీనటుల్ని తమిళ నిర్మాతల మండలి కట్టడి చేయాలని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ తిరుపూర్ సుబ్రమణియం పేర్కొన్నారు.
సినీనటుల్ని తమిళ నిర్మాతల మండలి కట్టడి చేయాలని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ తిరుపూర్ సుబ్రమణియం పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన వివేకం చిత్రానికి థియేటర్లలో అధిక టిక్కెట్ల విక్రయంపై ఈయన స్పందిస్తూ, ఈ టికెట్టు ధరతో సాధారణ ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి సినిమా చూడలేరన్నారు. అభిమానులు మాత్రమే చూస్తారన్నారు. బాహుబలి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి కారణం న్యాయమైన టికెట్ ధరేనన్నారు.
ప్రస్తుత టికెట్ అధిక వెలకు నిర్మాతల, నటులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కారణం అని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా టికెట్ ధర విషయంలో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు.