
నవ్వుల నవాబు
ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ తొలిసారిగా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నవాబ్ బాషా’. బి. రాజేశ్ పుత్ర దర్శకత్వంలో పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. ఇటీవలే ఈ సినిమా పాటల సీడీని శాసన సభ్యుడు బడేటి బుజ్జి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘సినిమా చాలా బాగా వచ్చింది. నవాబ్ కాలం నాటి ఓ యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమా చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ పుత్ర, పాటలు: మల్లి మామిడి, కెమెరా: శ్రీనివాస్‌రెడ్డి కంకణాల.