దీపావళి శుభాకాంక్షలు! | murugadoss keerthi suresh new movie | Sakshi
Sakshi News home page

దీపావళి శుభాకాంక్షలు!

Published Sun, Jan 21 2018 3:41 AM | Last Updated on Sun, Jan 21 2018 3:41 AM

murugadoss keerthi suresh new movie - Sakshi

‘దీపావళి శుభాకాంక్షలు’ అంటున్నారు దర్శకుడు మురుగదాస్‌. మూడు నెలల క్రితమే కదా.. దీపావళి వచ్చింది. ఈ ఏడాది దీపావళి రావడానికి ఇంకా చాలా టైమ్‌ ఉంది కదా. మరీ ఇంత ఎర్లీగా మురుగదాస్‌ ఎందుకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారనేగా మీ డౌట్‌. మరేం లేదు. విజయ్‌ హీరోగా ‘కత్తి’, ‘తుపాకీ’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను తెరకెక్కించిన మురుగదాస్‌ మళ్లీ ఈ హీరోగారితో ఓ సినిమా మొదలుపెట్టారు.

ఇందులో కీర్తీ సురేశ్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అందుకే ముందే ‘దీపావళి’ శుభాకాంక్షలు చెప్పేశారు.ఆల్రెడీస విజయ్‌–మురుగదాస్‌ కాంబినేషన్‌లో రెండు హిట్‌ చిత్రాలొచ్చాయి కాబట్టి, మూడో సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. విజయ్‌ ఫ్యాన్స్‌ అయితే ‘హ్యాట్రిక్‌ ఖాయం’ అని ఫిక్స్‌ అయిపోయారు. ఆ సంగతలా ఉంచితే... వచ్చే దీపావళికి బాక్సాఫీస్‌ దగ్గర విజయ్‌ సినిమాతో సూర్య, అజిత్‌ సినిమాలు పోటీ పడబోతున్నాయట. మరి.. ఏ హీరో సినిమా వసూళ్ల మోత మోగిస్తుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement