
విజయేంద్ర ప్రసాద్, శివప్రసాద్, నవనీత్, సాంబశివ, సంతోషి
సాంబశివ, సంతోషి శర్మ హీరోహీరోయిన్లుగా శివప్రసాద్ గ్రంధే స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా కథలో నేను’. సంగీత దర్శకుడు నవనీత్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘పాట వినసొంపుగా చాలా బావుంది. శివప్రసాద్ ప్రయత్నం సక్సెస్ కావాలి.
సినిమా హిట్ అయి టీమ్‌కు మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘అడిగిన వెంటనే చిన్న సినిమా అయినా సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చిన విజయేంద్రప్రసాద్‌గారికి కృతజ్ఞతలు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. త్వరలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాత శివప్రసాద్. ‘‘సినిమాలో నాలుగు పాటలున్నాయి. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసినందుకు విజయేంద్రప్రసాద్ గారికి థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకుడు నవనీత్.
Comments
Please login to add a commentAdd a comment