
‘రజనీకాంత్ ‘తలైవర్’ (నాయకుడు) అయితే మరి వారంతా ఎవరు’ అని దర్శకుడు, నామ్ తమిళర్ కచ్చి పార్టీ అధినేత సీమాన్ ప్రశ్నించారు. మహిళా పోలీసుల కథాంశంతో వి హౌస్ ప్రొడక్షన్స్ బ్యానరుపై సురేష్ కామాక్షి ‘మిగ మిగ అవసరం’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీప్రియాంక పోలీసుగా అధికారిగా, హరీష్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో సీమాన్ పోలీసు ఉన్నతాధికారిగా నటించారు. ఇషాన్ దేవ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్, దర్శకుడు చేరన్, సీమాన్, నిర్మాత జేకే రితీష్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని పాటలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి మాట్లాడుతూ ‘తానెప్పుడూ చర్చనీయాంశ వ్యాఖ్యలే చేస్తానంటారని, సమస్యల గురించి మాట్లాడడం చర్చనీయాంశం అంటే తాను అలానే మాట్లాతానని’ అన్నారు. ఈ చిత్రం గురించి, పని చేసిన వారి గురించి చిత్ర సక్సెస్ మీట్‌లో మాట్లాడతానని సురేశ్ కామాక్షి పేర్కొన్నారు. అనంతరం సీమాన్ మాట్లాడుతూ ‘‘తలైవర్’ (అధినేత) అనే పదానికి అర్థం తెలియకుండానే ఇక్కడ ఎంతో మంది జీవిస్తున్నారు. టీవీలో చర్చావేదికలను చూస్తే అందులో పాల్గొనేవారంతా రజనీకాంత్ గురించి మాట్లాడేటప్పుడు ‘తలైవర్’తో నటించాను, ‘తలైవర్’తో మాట్లాడాను, ‘తలైవర్’ను కలిశాను అంటున్నారు. రజనీకాంత్‌ను ‘తలైవర్’ అంటూ పొగుడుతున్నారు. ఆయన ‘తలైవర్’ అయితే.. కామరాజర్ ఎవరు.. ప్రభాకరన్ ఎవరు.. అంటే వాళ్లంతా దేశ ద్రోహులా..?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment