
‘మేం వయసుకు వచ్చాం, అలా ఎలా, సుప్రీమ్, పిల్ల జమీందార్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఛలో’ చిత్రాలకు కెమెరామన్‌గా పనిచేసిన సాయి శ్రీరామ్ దర్శకునిగా మారారు. నాగశౌర్య హీరోగా ఆయన తెరకెక్కించనున్న సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రార ంభమైంది. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై యం.విజయకుమార్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి కెమెరా స్విచ్చాన్ చేయగా, రచయిత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. విజయకుమార్ మాట్లాడుతూ–‘‘సాయి శ్రీరామ్ చెప్పిన కథ, కథనాలు కొత్తగా ఉన్నాయి. అందుకే తొలిప్రయత్నంగా ఈ సినిమా నిర్మిస్తున్నా. నాగశౌర్య నటించిన చిత్రాలలో ఈ ప్రేమకథా చిత్రమ్ వైవిధ్యంగా ఉంటుందని నిస్సందేహంగా చెప్పగలను. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అన్నారు. దర్శకులు అనిల్ రావిపూడి, వి.ఐ.ఆనంద్, ఉపేంద్ర తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: హరిప్రసాద్ జాస్తి, కథ: విద్యాసాగర్ రాజు, మాటలు: విశ్వనేత్ర.
Comments
Please login to add a commentAdd a comment