Sai Sriram
-
'కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారు'
కమలహాసన్, అజిత్ భరతనాట్యానికి ద్రోహం చేశారని నటుడు, దర్శక నిర్మాత సాయి శ్రీరామ్ తీవ్రంగా ఆరోపించారు. ప్రముఖ భరతనాట్య కళాకారి అయిన ఈయన 30 ఏళ్లుగా ఆ కళామతల్లికి సేవలందిస్తున్నారు. తాజాగా భరతనాట్యం ఇతివృత్తంతో 'కుమారసంభవం' చిత్రాన్ని రూపొందించారు. దీనికి ఇతడే కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, నృత్యం, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు చేపట్టి కథానాయకుడిగా నటించడం విశేషం. ఈ చిత్రంలో నిఖితా మీనన్, సాయి అక్షిత, మీనాక్షి అనే ముగ్గురు కథానాయికలుగా నటించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సాయి శ్రీరామ్ గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు తన తండ్రి పీకే.ముత్తు కూడా భరత నాట్య కళాకారుడని తెలిపారు. ఆయన కొన్ని చిత్రాలకు నృత్య దర్శకుడిగానూ పని చేశారన్నారు. అయితే కొన్నేళ్లుగా భరత నాట్య కళను కించపరిచే విధంగా సినిమాలు చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు వరలారు చిత్రంలో నటుడు అజిత్ భరతనాట్యం నేర్చుకోవడం వల్లే తనకు వివాహం కాలేదని పేర్కొన్నారు. అదేవిధంగా నటుడు కమల్ హాసన్ భరతనాట్య కళాకారుడు కావడం వల్లే భార్య ఆయన్ని వదిలి వెళ్లిపోయినట్లు చిత్రీకరించారన్నారు. అలా భరత నాట్య కళాకారుడిని పెళ్లి చేసుకోవడానికి యువతులు ముందుకు రారనే తప్పుడు సంకేతాలను చిత్రాల ద్వారా కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అపోహలను పోగొట్టడానికే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. చదవండి: 'లవ్‌స్టోరీ' సినిమా రిలీజ్ వాయిదా బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నం: ఫొటోలు వైరల్! -
కొత్త ప్రేమకథ
‘మేం వయసుకు వచ్చాం, అలా ఎలా, సుప్రీమ్, పిల్ల జమీందార్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఛలో’ చిత్రాలకు కెమెరామన్‌గా పనిచేసిన సాయి శ్రీరామ్ దర్శకునిగా మారారు. నాగశౌర్య హీరోగా ఆయన తెరకెక్కించనున్న సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రార ంభమైంది. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై యం.విజయకుమార్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి కెమెరా స్విచ్చాన్ చేయగా, రచయిత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. విజయకుమార్ మాట్లాడుతూ–‘‘సాయి శ్రీరామ్ చెప్పిన కథ, కథనాలు కొత్తగా ఉన్నాయి. అందుకే తొలిప్రయత్నంగా ఈ సినిమా నిర్మిస్తున్నా. నాగశౌర్య నటించిన చిత్రాలలో ఈ ప్రేమకథా చిత్రమ్ వైవిధ్యంగా ఉంటుందని నిస్సందేహంగా చెప్పగలను. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అన్నారు. దర్శకులు అనిల్ రావిపూడి, వి.ఐ.ఆనంద్, ఉపేంద్ర తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: హరిప్రసాద్ జాస్తి, కథ: విద్యాసాగర్ రాజు, మాటలు: విశ్వనేత్ర. -
దర్శకుడిగా మరో సినిమాటోగ్రాఫర్
సినిమాటోగ్రాఫర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాంకేతిక నిపుణులు దర్శకుడిగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి, రసూల్ ఎల్లోర్, సంతోష్ శివన్ లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్లతో పాటు కార్తీక్ ఘట్టమనేని లాంటి యువ టెక్నిషియన్స్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయారు. తాజాగా మరో సినిమాటోగ్రాఫర్ కూడా ఈ లిస్ట్ లో చేరబోతున్నాడు. పిల్ల జమీందార్, సుప్రీమ్, గీతాంజలి, ఎక్కడికీ పోతావు చిన్నవాడా లాంటి చిత్రాలకు కెమెరామేన్ గా పనిచేసిన సాయి శ్రీరామ్ త్వరలో దర్శకుడిగా మారనున్నాడు. నాగశౌర్య హీరోగా సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది.