దర్శకుడిగా మరో సినిమాటోగ్రాఫర్ | naga shourya work under cinematographer sai sriram direction | Sakshi
Sakshi News home page

దర్శకుడిగా మరో సినిమాటోగ్రాఫర్

Published Sun, Oct 1 2017 10:54 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

Sai Sriram, naga Shourya - Sakshi

సినిమాటోగ్రాఫర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాంకేతిక నిపుణులు దర్శకుడిగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి, రసూల్ ఎల్లోర్, సంతోష్ శివన్ లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్లతో పాటు కార్తీక్ ఘట్టమనేని లాంటి యువ టెక్నిషియన్స్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయారు. తాజాగా మరో సినిమాటోగ్రాఫర్ కూడా ఈ లిస్ట్ లో చేరబోతున్నాడు.

పిల్ల జమీందార్, సుప్రీమ్, గీతాంజలి, ఎక్కడికీ పోతావు చిన్నవాడా లాంటి చిత్రాలకు కెమెరామేన్ గా పనిచేసిన సాయి శ్రీరామ్ త్వరలో దర్శకుడిగా మారనున్నాడు. నాగశౌర్య హీరోగా సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement