‘ఆఫీసర్‌’గా నాగ్‌..? | Nagarjuna and Ram gopal varma Movie Title Officer | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 27 2018 11:04 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarjuna in Ram Gopal Varma Film - Sakshi

రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో నాగార్జున

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం సీనియర్‌ స్టార్‌ నాగార్జున హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను రిలీజ్ డేట్‌ను ఆదివారం రిలీజ్ చేస్తామని వర్మ టీం ప్రకటించారు. అయితే ఆ రోజు శ్రీదేవి మరణవార్త తెలియటంతో ప్రకటనను వాయిదా వేశారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నాగ్ పోలీస్‌ అధికారిగా కనిపించనున్న ఈ సినిమాకు ఆఫీసర్‌ అనే టైటిల్‌ ను ఫైనల్‌ చేశారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ముంబైలో క్లైమాక్స్‌ పార్ట్‌ షూటింగ్ జరుపుకుంటున్నఈ సినిమాలో మోడల్‌ మైరా సరిన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement