సాక్షి, హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ‘మనం’ సినిమా సెట్ పూర్తిగా కాలిపోవడంతో చాలా బాధగా ఉందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సెట్ ను చూసినప్పుడల్లా ఆయన గుర్తొచ్చేవారని అన్నారు. మనుషులే పోయినప్పుడు.. సెట్ కాలిపోతేముందిలే అన్న నాగర్జున.. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడం సంతోషకరమైన విషయం అన్నారు.
ఇంత పెద్దగా ఎగిసిపడుతున్న మంటలు ఎలా ఆర్పుతారనుకున్నా..కానీ ఫైర్ సిబ్బంది కేవలం 15 నిమిషాల్లో పని పూర్తి చేశారన్నారు. ఈ సందర్భంగా ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు, పోలీసులకు నాగర్జున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా సెట్ కు రూ.2 కోట్లకు పైనే అప్పుడు ఖర్చయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ‘రాజు గారి గది’ తో పాటు పలు సినిమాలకు ఈ సెట్ లోనే షూటింగ్ జరిగిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment