మబ్బుల్లో నడుస్తున్నట్టుంది : నాగార్జున | Nagarjuna in mahabaleshwaram for om namovenkateshaya | Sakshi
Sakshi News home page

మబ్బుల్లో నడుస్తున్నట్టుంది : నాగార్జున

Published Sun, Oct 9 2016 12:41 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

మబ్బుల్లో నడుస్తున్నట్టుంది : నాగార్జున - Sakshi

మబ్బుల్లో నడుస్తున్నట్టుంది : నాగార్జున

కింగ్ నాగార్జున ప్రస్తుతం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓం నమోవేంకటేశాయ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడీ సాయి లాంటి భక్తిరస చిత్రాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మహాబలేశ్వరం లోని కొండల్లో జరగుతోంది. ఈ సందర్భంగా షూటింగ్ సమయంలో తీసిన ఓ వీడియో క్లిప్ను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన నాగార్జున 'మహాబలేశ్వరంలో మబ్బుల్లో నడుస్తున్నట్టు, ప్రపంచపు అంచున ఉన్నట్టుగా అనిపిస్తోంది' అంటూ కామెంట్ చేశాడు. శుక్రవారం కువైట్ నుంచి తిరిగి వచ్చిన నాగ్, వెంటనే ఓం నమోవేంకటేశాయ షూటింగ్ కోసం మహాబలేశ్వరం వెళ్లారు. మహేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2017 ప్రథమార్థంలో రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement