అవంతిక.. డేంజరస్‌ పిల్ల | Nagarjuna Manmadhudu 2 Rakul Preet Singh Avantika Teaser | Sakshi
Sakshi News home page

అవంతిక.. డేంజరస్‌ పిల్ల

Published Tue, Jul 9 2019 9:42 AM | Last Updated on Tue, Jul 16 2019 4:38 PM

Nagarjuna Manmadhudu 2 Rakul Preet Singh Avantika Teaser - Sakshi

కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌లపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా రకుల్ ప్రీత్‌ సింగ్ పోషించిన అవంతిక పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రకుల్ రెండు డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. సమంత, కీర్తి సురేష్‌లు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిశోర్‌, లక్ష్మీ, రావూ రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్‌ సంగీతమందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement