నాగ్ ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదే..! | Nagarjuna turns singer for Nirmala Convent | Sakshi
Sakshi News home page

నాగ్ ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదే..!

Published Sat, Jul 23 2016 12:31 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్ ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదే..! - Sakshi

నాగ్ ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదే..!

ఇటీవల ట్విట్టర్లో కింగ్ నాగార్జున చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. తన ట్విట్టర్ పేజ్ పై ఈ నెల 23న అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇస్తానంటూ ట్వీట్ చేశాడు నాగార్జున. అయితే ఈ ట్వీట్ దర్శనమిచ్చిన దగ్గర నుంచి మీడియా సర్కిల్స్ నాగ్ ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటన్న చర్చ జరగింది. కొంత మంది నాగ్ తన తనయుల పెళ్లి విషయం ప్రకటిస్తాడని, మరి కొంత మంది ప్రస్తుతం నాగ్ చేయబోయే సినిమాకు సంబందించిన అప్ డేట్ ఇస్తాడని మాట్లాడుకున్నారు.

అయితే రూమర్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నాగ్ ఇవ్వబోయే ఆ సర్ప్రైజ్ ఏంటో తెలిసిపోయింది. ప్రస్తుతం శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నిర్మాలా కాన్వెంట్ సినిమాను నిర్మిస్తున్నాడు నాగార్జున. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నాగ్, తనలోని మరో టాలెంట్ కూడా చూపించబోతున్నాడు. గతంలో సీతారామరాజు సినిమాలో సిగరెట్ గొప్పదనాన్ని కీర్తిస్తూ ఓ పాట పాడిన నాగ్, నిర్మాలా కాన్వెంట్ కోసం మరోసారి సింగర్ అవతారం ఎత్తాడు.

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు సాలూరి రోషన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ తనయుడు ఏఆర్ అమీన్తో కలిసి నాగ్ ఓ పాట పాడాడు. ఈ పాటను శనివారం సాయత్రం తన ట్విట్టర్లో రిలీజ్ చేయనున్నాడు నాగ్. సీనియర్ హీరోలలో సూపర్ ఫాంలో ఉన్న నాగ్ సింగర్ కూడా తన సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నాడన్న మాట.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement