కొత్త అందాలతో రీ ఎంట్రీ
కొత్త అందాలతో రీ ఎంట్రీ
Published Wed, Oct 30 2013 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
అడవిలాంటి అందాల్నే ఆక్రమించాడే అంటూ తెలుగు చిత్రం సింహాలో యువతను గిలిగింతలు పెట్టిన గ్లామర్ క్వీన్ నమిత. బొద్దుగా ముద్దుగా ఉండే ఈ భామకు కోలీవుడ్‌లో క్రేజ్ అంతా ఇంతా కాదు. నమిత ప్రస్తుతం కాస్త బరువు తగ్గి కొత్త అందాలతో రీఎంట్రీ కానుం ది.ఆమె మాట్లాడుతూ ఇప్ప టి వరకు అందాలారబోతతో బోర్ కొట్టిందని తెలిపింది. ఇకపై లేడి అమితాబ్ విజయశాంతిలా నటించాలనుందని పేర్కొంది.
మరో విజయశాంతిలా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పింది. ఇదిలావుండగా ప్రస్తుతం ఈ బ్యూటీ త్రిభాషా చిత్రం (తమిళం, తెలుగు, కన్నడం) ఇళమై ఊంజల్‌లో పోలీసు అధికారిగా పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తోంది. మృగాళ్ల అకృత్యాలకు బలయ్యే అబలను రక్షించే ధైర్యసాహసాలు గల యువతిగా నమిత ఈ చిత్రంలో కనిపించ నుంది.
హరిరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. నిజానికి ఈ చిత్రంలో నమితను ఆయన మరోపాత్రల్లో నటింపజేయాలనుకున్నారట. అయితే యాక్షన్‌పై మనసుపడ్డ నమిత పోలీసు అధికారి పాత్రనే ఎంచుకుందట. చిత్రంలోని నమిత యాక్షన్ సన్నివేశాలు చూసి స్టంట్ దర్శకుడు ఎంతగానో అభినందించారట. రీ ఎంట్రీలో నమిత ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement