
మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసిందే. షూటింగ్‌లకు గ్యాప్ వస్తే.. ఫ్యామిలీని తీసుకుని విదేశాలకు వెళ్తుంటారు. ఫ్యామిలీతో గడపడం మహేష్‌కు సరదా అనే విషయం తెలిసిందే. ఇక సితారా, గౌతమ్‌లు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వీరు చేసే అల్లరిని మహేష్ సతీమణి నమ్రతా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా మహేష్, గౌతమ్, సితారాలు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. లంచ్ టైమ్ ఇంట్లోనో గడిపాము అంటూ.. తెలిపారు. లంచ్‌టైమ్‌లో తనకిష్టమైన ఫుడ్ చేయలేదోమో.. సితారా అలిగితే.. మహేష్ వచ్చి ఓదార్చుతున్నట్లు..గౌతమ్ వచ్చి వీరి మీది పడి నవ్వుతున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ ప్రస్తుతం ‘మహర్షి’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.